అవిశ్రాంత ఉద్యోగ సంఘ నాయకుడు బొమ్మిడి భద్రయ్యకు కన్నీటి వీడ్కోలు

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, ఫిబ్రవరి 24: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీకి చెందిన అవిశ్రాంత ఉద్యోగి, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు బొమ్మిడి భద్రయ్య (89) మంగళవారం ఉదయం ఎల్ఎండి (అలుగునూర్)లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
ఇరిగేషన్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ అసోసియేషన్, డిఏం, ట్రేసర్స్ అసోసియేషన్‌లలో అధ్యక్షుడు, కార్యదర్శిగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘానికి అధ్యక్షుడిగా నాయకత్వం వహించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
మధ్యాహ్నం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన నివాళులు అర్పించారు. ఆయన మృతి ఉద్యోగ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.