ఉద్రిక్తంగా బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడి

బాసర, జూన్ 15 విశ్వంన్యూస్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గత రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడంతో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డా పడకంటి రమాదేవి, భైంసా పట్టణ బిజెపి అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేష్ తో సహా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాసర ఐఐఐటీలోకి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి రావడంతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం పోలీసులను పెట్టి జిల్లా అధ్యక్షులు రమాదేవిని మిగతా బిజెపి శ్రేణులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

జిల్లా వ్యాప్తంగా ఉధ్యమం చేపడతామని బిజెపి నాయకులు తెలిపారు. బీఆర్ఎస్‌ పాలనకు ఓటుతోనే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *