దొంగను దొంగ లాగా చూస్తారు: కేటీఆర్ ఘాటు విమర్శ

దొంగను దొంగ లాగా చూస్తారు: కేటీఆర్ ఘాటు విమర్శ

  • సర్కార్ కాదు, సర్కస్ నడుపుతున్నావా?

హైదరాబాద్, మే 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “నేను ఎక్కడికి వెళ్లినా నన్ను దొంగలా చూస్తున్నారంటున్నారు రేవంత్ రెడ్డి. దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు?” అంటూ ఘాటు ప్రశ్నలు వేశారు. అందాల పోటీలకు రూ.250 కోట్లు వెచ్చించేందుకు డబ్బులు ఉన్నా, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి నిధులేమిటని ప్రశ్నించారు. “నిన్ను కోసుకొని తినడం కాదు, నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావు,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

రెవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కార్ కాదు, సర్కస్ నడుపుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పారు. కానీ తాజాగా రూ.8.29 లక్షల కోట్లను అంటున్నారు అని ఆరోపించారు. “పూటకో లెక్క, గూటికో సంఖ్య పెడుతున్నావు. అసలైన బీఆర్ఎస్ అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే,” అని స్పష్టం చేశారు. “ప్రస్తుతం రాష్ట్రం నెలకు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే అసలు+వడ్డీగా చెల్లిస్తోంది. ఇది కాగ్ (CAG) లెక్క, మీ కాకి లెక్క కాదు,” అన్నారు.

“చెప్పులు ఎత్తుకుపోయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ నాయకులు ఉన్నారు. ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే ప్రజలు దొంగలుగా చూస్తారు,” అని వ్యాఖ్యానించారు.”రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లు, లగ్జరీ ప్రయాణాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు,” అని విమర్శించారు.

“ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎలా కొన్నావు రేవంత్ రెడ్డి? నీ కుటుంబ సభ్యుల ఆదాయం పెరిగింది కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు?” అని కేటీఆర్ నిలదీశారు.పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సంపద పెంచాలని చూస్తున్నావా అని విమర్శించారు. “ధరలు పెంచకూ, బుర్ర పెంచు; సంపద పెంచే ఆలోచన చేయి,” అంటూ తిడారు.

“కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే, నీ నాలుక చీరేస్తా,” అని కేటీఆర్ గట్టిగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *