ఇంటిపై కూలిన చెట్టు –
వీదినపడ్డ కుటుంబం…

గోవిందరావుపేట, మే 20 (విశ్వం న్యూస్) : ఇంటిపై చెట్టు కూలి ఒక నిరుపేద కుటుంబం వీధిలో పడింది వివరాల్లోకి వెళితే గోవిందరావుపేట మండలం పస్రా గ్రామం పోలీస్ స్టేషన్ వీధిలో నివసిస్తున్న ఎండి సాహు నిరుపేద కుటుంబం. శనివారం సాయంత్రం వీచిన గాలి దుమారానికి ఇంటి ముందు ఉన్న చెట్టు కూలి ఇంటిపై పడడంతో గోడలు విరిగి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం అయినట్లు కుటుంబ పెద్ద ఎండి సాహు తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యులు గాలి దుమారానికి బయటకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న వంట సామాగ్రి ఫర్నిచర్ ఫ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం అయ్యాయని వారు తెలిపారు. కూలి నాలి చేసుకుని బతుకుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించారు. ఈ విషయంలో అధికారులు వెంటనే పరిశీలించి తాత్కాలిక సహాయం అందించాలని స్థానిక ప్రజలు కోరారు.