తండ్రి ప్రేమకు అద్దం పట్టిన వీడియో

తండ్రి ప్రేమకు
అద్దం పట్టిన వీడియో

హైదరాబాద్, మార్చి 9 (విశ్వం న్యూస్) : ఓ గర్భిణి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్ది సేపటికే వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటకు వచ్చింది. ఆసుపత్రి బయట ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో ఆ చిన్నారిని పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి… తన బిడ్డను చూడగానే ఒక్క క్షణం మాట రాక భావోద్వేగానికి గురయ్యాడు.

తండ్రి పాత్ర కుటుంబంలో ఎంతో బాధ్యతతో కూడుకున్నది. తల్లి పిల్లల సంరక్షణ చూసుకుంటే… ఆ కుటుంబాన్ని మొత్తం కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తండ్రిదే. అందుకే తండ్రి ఉంటే పిల్లలకు ఎక్కడ లేని ధైర్యం కలుగుతుంది. బయటికి గంభీరంగా కనిపించే తండ్రి మనసులో పిల్లలపై అపారమైన ప్రేమ దాగి ఉంటుంది.

పుట్టిన వెంటనే తొలిసారి తన బిడ్డను చేతిలోకి తీసుకున్న ఆ తండ్రి… చిన్నారి స్పర్శ తాకగానే వింత అనుభూతికి లోనయ్యాడు. తండ్రి అయ్యాననే ఆనందం అతని కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఆ క్షణంలో మొదలైన ప్రేమ జీవితాంతం అలాగే కొనసాగుతుందనే భావనను ఆ దృశ్యం తెలియజేస్తోంది.

మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి తన బిడ్డను ఎత్తుకున్న సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతూ… “ఇదే నిజమైన తండ్రి ప్రేమ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ హృద్యమైన వీడియో ఇప్పటికే కోట్ల మంది హృదయాలను హత్తుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *