బిజెపి నాయకుడు శ్రావణ్ యాదవ్ కు వెళ్ళువెత్తిన పరామర్శ

కాజీపేట:బిజెపి నాయకుడు శ్రావణ్
యాదవ్ కు వెళ్ళువెత్తిన పరామర్శ

కాజీపేట, ఆగస్టు 25 (విశ్వం న్యూస్) : కాజీపేట 62వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్, బిజెపి నాయకుడైన మేకల శ్రావణ్ యాదవ్ ను బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, హనుమకొండ జిల్లా ఇన్చార్జి మురళీధర్ గౌడ్ లు శుక్రవారం పరామర్శించారు. డబుల్ బెడ్ రూమ్ లకు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే క్రమంలో జరిగిన దాడుల్లో శ్రావణ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు ఆసుపత్రిలో చికిత్స అనంతరం సోమిడిలోని తన ఇంటికి చేరుకున్న శ్రావణ్ యాదవ్ ను పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్ యాదవ్, కొత్తపల్లి రాజేష్, చెన్నబోయిన శివ, గణేష్ , దేవయ్య, హరీష్ తదితర కార్యకర్తలను బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ లు పరామర్శించారని తెలిపారు. బిజెపి నాయకుల పైన జరిగిన దాడి సంఘటన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.

అంతకుముందు శ్రావణ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తండ్రి మేకల కేదారి యాదవ్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామి, నాయకులు కందకట్ల సత్యనారాయణ, చిర్ర నర్సింగ్ గౌడ్, కాయిత రాజ్ కుమార్ యాదవ్, సుంచు వేణు, కాయిత కుమార్, సుంచు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *