ఆకేరు.. అశ్వినిని మింగేసింది

మహబూబాబాద్, సెప్టెంబర్ 1 (విశ్వం న్యూస్) : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జ్ వద్ద కారు ఆకేరులో పడిపోయిన సంఘటనను, కారుతోపాటు, తండ్రి,కూతురు గల్లంతైన వారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధించినప్పటికీ కాలం వారిని కబలించింది..

ఉజ్వల భవిష్యత్ ఉన్న ఉన్నతవిద్యావంతురాలు కుమారి నూనావత్ అశ్విని ని ఆకేరు మింగేసింది. ఆకేరు పక్కన కొంతదూరంలో ఉన్న పామాయిల్ తోటలో అశ్విని మృతదేహం కనిపించింది.

కారు ఆనవాళ్లు కూడా ఏటి ప్రవాహంలో కనిపిస్తున్నాయి. తండ్రి మోతిలాల్ ఆచూకి మాత్రం ప్రస్తుతానికి లభ్యంకాలేదు.

పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరులో కనిపిస్తున్న తండ్రి, కూతురు ప్రయాణం చేసిన కారు. ఆపరేషన్ లో స్వయంగా పాల్గొని ఆకేరు ప్రవాహంలో తాళ్ళసహాయంతో కారు వద్దకు వెలుతున్న మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ చెన్నయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *