మీరంతా సున్నాలు వేసే
సన్నాసి బ్యాచే:కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 16 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్మించిన ఇళ్లకు సున్నాలు వేసి ఇందిరమ్మ ఇళ్లని కాంగ్రెస్ నేతలు ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం రేవంత్ తరం కాదన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందివ్వడం కేసీఆర్ కల అని పేర్కొన్నారు. ఎన్నాళ్లైనా ఆ నిర్మాణాలకు మీరంతా సున్నాలు వేసే సన్నాసి బ్యాచ్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు.