ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్

ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్

  • పుష్పకు రెండు జాతీయ ఫిల్మ్ అవార్డ్

న్యూఢిల్లీ, ఆగస్టు 24 : 69వ జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను నేడు జ్యూరీ ప్ర‌క‌టించింది.. 31 అవార్దుల కోసం మొత్తం 28 భాష‌ల‌లో 280 చిత్రాలు పోటీ ప‌డ్డాయి. ఈసారి అవార్డుల‌లో తెలుగు సినిమాలు కొత్త చ‌రిత్ర‌ను లిఖించాయి.. ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ వినోదాత్మ‌క‌ చిత్రం, ఉత్త‌మ సంగీతం, ఉత్తమ బ్యాంక్ గ్రౌండ్ సంగీతం, ఉత్త‌మ కొరియో గ్రఫీ, ఉత్త‌మ స్టంట్ కొరియో గ్రఫీ, ఉత్త‌మ గీత ర‌చయిత‌, ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్ అవార్డులు తెలుగు మూవీలు ఎగ‌రేసుకుపోయాయి..

69 సంవ‌త్స‌రాల జాతీయ అవార్దుల‌లో తొలిసారిగా తెలుగు హీరో అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగాఅవార్దు కైవ‌సం చేసుకుని టాలీవుడ్ కీర్తీని మరింత పెంచారు.. ఉప్పెన మూవీకి ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది..ఇక ఉత్తమ క్రిటిక్ అవార్డు ను తెలుగు మూవీ పురుషోత్తమ్ కు లభించగా, ఉత్తమ లిరిసిస్ట్ గా చంద్రబోస్ కొండపాలెం మూవీ ద్వారా ఎంపికయ్యారు

ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగం …
స్టంట్ కొరియో గ్ర‌ఫి సాల్మ‌న్ RRR మూవీ
ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ RRR మూవీ
విజువ‌ల్ ఎఫెక్ట్ వి శ్రీనివాస్ RRR మూవీ
ఉత్త‌మ లిరిసిస్ట్ – చంద్ర‌బోస్- కొండ‌పాలెం మూవీ
బెస్ట్ సంగీత ద‌ర్శ‌కులు … ఫుష్ష . .. దేవీశ్రీ ప్ర‌సాద్ ,
బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఎం ఎం కీర‌వాణి. RRR
ఉత్త‌మ గాయ‌ని – శ్రీయా ఘోష‌ల్
ఉత్త‌మ గాయ‌కుడు – కాల‌భైర‌వ
RRR మూవీ ఉత్త‌మ న‌టి .. అలియా భ‌ట్
గంగుభాయి వాడియా కీర్తి,స‌న‌న్,మిమి మూవీ
ఉత్త‌మ న‌టుడు – అల్లు అర్జున్ పుష్ప‌
ఉత్త‌మ చిత్రం – రాకెట్రీ ..ద నంబి తమిళం
ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రం RRR మూవీ

ఉత్త‌మ ప్రాంతీయ చిత్రాలు
ఉత్త‌మ హిందీ చిత్రం స‌ర్దార్ ఉద్దమ్
క‌న్న‌డ చిత్రం 777 చార్లీ
మ‌ల‌యాళం చిత్రం – హోమ్
త‌మిళ చిత్రం క‌దాసి వ్య‌వ‌సాయి
తెలుగు ఫిల్మ్ .. ఉప్పెన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *