- వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : బాబాసాహెబ్ జయంతి సందర్బంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హైదరాబాద్ నడి ఒడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల భారీ విగ్రహం రేపు అంగరంగ వైభవంగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం అని ఏర్పాట్లు చేసింది.
దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లోకెల్లా అతి ఎత్తైన విగ్రహంగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ విగ్రహం ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని తయారుచేశారు. అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరించనున్నారు.