అమిత్ షా వి పగటి కలలు

అమిత్ షా వి పగటి కలలు

  • కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

కరీంనగర్, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తానని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినట్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యా ఉద్యోగాలలో ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తానని అతను బహిరంగ సభలో మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం అని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశంలో పుట్టిన ముస్లింలకు బతికే స్వేచ్ఛ లేదా మమ్మల్ని ఇతర దేశాల నుండి బతకడానికి భారతదేశంలో వచ్చినట్లు గ్రహించటం బిజెపి పార్టీ చేస్తున్న పెద్ద పొరపాటు ఈ యొక్క భారతదేశంలో సాధించటంలో గతంలో జరిగిన స్వసంత్రం పోరాటంలో ముందుండి పోరాటం చేసిన ముస్లింల గురించి ఇలా మాట్లాడటం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తగునా అందరితోపాటు భారతదేశ సాధించుకోవడంలో ఎంతోమంది ముస్లింలు ఎన్నో ప్రాణాలను త్యాగం చేసిన సాధించుకున్న భారత దేశంలో నివసిస్తున్న ముస్లింల గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిసారి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం, బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పై ప్రమాణం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముస్లింలను అవమానపరచడమే.

భారతదేశంలో పుట్టిన ముస్లింల గురించి ఇలా మాట్లాడటం సమాజ సమ కేంద్ర హోంశాఖ అమిత్ షా భారతదేశంలో పుట్టి ఇక్కడే చదువుకొని వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ప్రతి ఎన్నికలలో ముస్లింలు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటప్పుడు ఈరోజు చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినట్లయితే ముస్లింలకు కొనసాగుతున్న విద్యా ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తానని చెప్పటం అమిత్ షా నీకు తగునా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు కాదు అమిత్ షా కళలు కంటున్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

కర్ణాటక రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లను తొలగించి బిజెపి పార్టీ పెద్దా పొరపాటు చేసింది కనుక జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటు కాదు అలాంటి కలలు తెలంగాణ రాష్ట్రంలో కనటం వారికి రాబోయే కాలంలో వారికి తెలుస్తుంది ప్రతిసారి బిజెపి పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం ముస్లింలకు వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టటం బిజెపి పార్టీకి అలవాటయింది అంతట జరిగినట్టు తెలంగాణ రాష్ట్రంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని బిజెపి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రాలలో ఏర్పాటు కాదు.

ఇక్కడ బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడం ఖాయం అని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *