- భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది ముస్లింలు బతుకుతున్నారు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముస్లింల గురించి మాట్లాడేటప్పుడు కొంచెమైనా అర్థం చేసుకోవాలి ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశంలోని నివసిస్తూ ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని వ్యాపారం చేసుకుని చనిపోయిన కూడా భారతదేశంలోని ఖనన చేస్తున్న అలాంటప్పుడు ముస్లింలు ఇతర ప్రాంతాల నుండి బతకడానికి వచ్చినట్టు చూడటం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తగునా ఈ భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది ముస్లింలు బతుకుతున్నారు.
అలాంటప్పుడు ఈ ముస్లింల గురించి ఇతర రాష్ట్రాలలో పర్యటన చేసినప్పుడు అక్కడి ప్రభుత్వాలు అక్కడి ముస్లింల పరిస్థితులను బట్టి వారికి ఏదో రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరచినప్పుడు అలాంటి సంక్షేమ పథకాలను తొలగిస్తానని కేంద్రమంత్రి హోం శాఖ అమిత్ షా అనటం చాలా బాధాకరమైన విషయం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముస్లింల స్థితిగతుల మీద బీసీ కమిషన్ ద్వారా సర్వే జరిపించి ముస్లింలకు విద్యా ఉద్యోగాలను 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఇచ్చిన సర్వే ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు క్యాబినెట్ మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు వాస్తవమని చెప్పారు.
అలాంటప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ముస్లింలకు 12 శాతం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి మరియు శాసనమండలిలో ముస్లిం రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పంపించిన ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ఇప్పటివరకు కేంద్ర బిజెపి పార్టీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు.
అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చేవెళ్ల వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను కూడా తొలగిస్తానని చెప్పటం చాలా విచిత్రమైన విషయం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.