కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్
రాయ్ పూర్, పిబ్రవరి 26 (విశ్వం న్యూస్) : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్ పూర్ లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన 85వ ప్లీనరి మూడవరోజు చివరి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ ప్లీనరి సమావేశంలో ఏఐసీసీ నాయకులు మాణిక్యం ఠాగూర్ గారు, వి హనుమంతరావు గారు, సలీం అహ్మద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, కరీంనగర్ నియోజకవర్గం పిసిసి సభ్యులు రాష్ట్ర కార్యదర్శి టిపిసిసి వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లీనరీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో స్ట్రీరింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సిడబ్ల్యూసి ఆమోదించాల్సిన తీర్మానాలపై కీలక నిర్ణయాలు తీసుకొని, ప్రధానమైన వ్యవసాయరంగం సామాజిక-రాజకీయ సమస్యలపై సమావేశం తీర్మానాలను ఆమోదించడం జరిగింది.