కోర్టు ధిక్కరణ చేస్తూ ఇష్టరాజ్యంగా ఆంజనేయ నగర్ కాలనీ ఎన్నికలు

కోర్టు ధిక్కరణ చేస్తూ ఇష్టరాజ్యంగా ఆంజనేయ నగర్ కాలనీ ఎన్నికలు

చీఫ్ ఎలక్షన్ అధికారి వారించినా లెక్కచేయకుండా ఎన్నికల నిర్వహణ
ఈ ఎన్నిక చెల్లదంటూ కోర్టుకెక్కిన గాదె రమణారెడ్డి
బోడుప్పల్, ఫిబ్రవరి 5 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ ఆంజనేయ నగర్ కాలనీ (ఎ ఎన్ సి) కి సంబంధించిన కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల విషయంలో గత పాలకవర్గాలు లక్షల రూపాయల కుంభకోణం చేసిన నేఫధ్యంలో ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినప్పటి ,ఎన్నికలు నిర్వహించుకోవడానికి చీఫ్ ఎలక్షన్ అధికారి ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికలు వద్దంటూ కాలనీ బైలాస్ ప్రకారం ఎన్నిక నిర్వహించాలని , కాలనీ ఎస్బిఐ అకౌంటు ఎందుకు సీజ్ చేశారో.. అది ఓపెన్ చేసి లక్షల రూపాయలు ఎక్కడ ఎవరి చేతులకు వెళ్లాయో తెలియ జేసిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కాలనీ సీనియర్ నాయకులు గాదె రమణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికి తెలిసిందే.. ఈ సందర్భంగా గాదె రమణారెడ్డి మాట్లాడుతూ కాలనీలో ఇంతకు ముందు ఉన్నటువంటి పాలకవర్గాలు కొన్ని లక్షల రూపాయల కుంభకోణం చేసి సందర్భంగా కాలనీ ఎస్బిఐ అకౌంట్ ను సీజ్ చేయించడం జరిగింది. ఈ బ్యాంక్ సీజ్ వెనకాల ఎవరున్నారు, ఎన్ని లక్షల రూపాయల కుంభకోణాలు జరిగాయో కాలనీ ప్రజలకు తెలియజేయాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించిన గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కాలనీ ఫౌండర్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా కోశాధికారి ఎన్నికల చీఫ్ కమిషన్ అధికారికి నోటీసులు జారీ చేయగా,ప్రపోస్డ్ చీఫ్ ఎన్నికల అధికారి ఎన్నికలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించి, ఈ ఎన్నికల విధి నిర్వహణ నుంచి తప్పుకోవడం జరిగింది. కానీ అత్యుత్సాహంతో కోర్టు ధిక్కరణ చేస్తూ,ముందే ప్రకటించిన తేదీ 05.02.2023 ఆదివారం నాడు ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం అనగా 5 -02- 2023 రోజున ఉదయం ఎలాంటి పోటీదారులు లేకుండానే అత్యుత్సాహంతో తమకు తామే ఎన్నికలు నిర్వహించుకొని 250 పైచిలుకు ఓట్లు ఉండాల్సిన చోట 100 ఓట్లకు పైగా వచ్చినట్టు ప్రకటించుకుని, మేమే అధ్యక్షులము, మా ప్యానెల్ గెలిచిందని ప్రకటించిన నాయకుల పైన కచ్చితంగా కోర్టు దిక్కరణ న కేసు ఉంటుందని , ఈ ఎన్నిక చెల్లదని కోర్టు ధిక్కరణ చేస్తూ ఎన్నిక నిర్వహించిన వారందరి మీద గౌరవ న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *