కవితకు మరో బిగ్ షాక్: 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.

బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్చి 26 నుంచి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈనెల 9తో
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాదులు, ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి తీర్పును వెల్లడించింది. ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.

కవిత కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కొనసాగించాలి అని ఈడీ వాదనలు వినిపించింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదల అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తెలిపింది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపంచారు. 2 నిమిషాలు సమయం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే అప్లికేప్లిషన్ రూపంలో ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. దీంతో రాతపూర్వకంగా అప్లికేప్లిషన్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. అనంతరం తీర్పు
వెల్లడింల్ల చింది. ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీస్ట పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *