త్రిబుల్ ఐటీ బాసరలో మళ్ళీ మరొక అమ్మాయి ఆత్మహత్య

త్రిబుల్ ఐటీ బాసరలో మళ్ళీ
మరొక అమ్మాయి ఆత్మహత్య

  • ఐఐఐటి బాసరలో అసలు ఏం జరుగుతుంది..?
  • ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళటానికి అనుమతులు లేవు,ఎందుకు..
  • యూనివర్సిటీలో వీసి డైరెక్టర్ అధ్యాపకులు ఉన్నారా లేరా..?

పీర్జాదిగూడ, జూన్ 16 విశ్వంన్యూస్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏకైక త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో ఆర్జేయుకేటి బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీనీ అది ప్రతిష్టత్మకంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీని సుమారుగా 272 ఎకరాలలో నిర్మించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీలో జరుగుతున్న ఘోరాలు నేరాలు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల అందరూ కలిసి ఒక పేరెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని పిల్లలకు యాజమాన్యాలకు చేదోడు వాదోడుగా విధులకు వస్తున్నారు.

అదేవిధంగా పిల్లలకు జరుగుతున్న అన్యాలను అక్రమాలను ఆర్టీఐ చట్టం ద్వారా సీసీఆర్ గత సంవత్సర కాలంగా పోరాడుతున్న అధికార యంత్రాంగం నుండి ఎలాంటి స్పందన లేదని అటు తల్లిదండ్రులు ఇటు పార్టీ చట్టం వాళ్ళు లబోదిబోమంటున్నారు. ప్రతిసారి త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీ ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యుతో పెరమిదికి రావడం అలవాటుగా మారింది. ఇటీవలే పియుసి వన్ అండ్ టు విద్యార్థిని విద్యార్థులు సమ్మర్ హాలిడేస్ కు వెళ్లి వచ్చేసరికి వారి రూమ్స్ తాళాలు పగలగొట్టి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ బ్యాగులు బాక్సులు పగలగొట్టి అన్నింటినీ సెల్లార్స్ లో పడేయడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వారి విలువైన ఒరిజినల్ సర్టిఫికెట్స్ సామాగ్రి బుక్స్ డ్రెస్సులు మెడిసిన్స్ తినే ప్లేట్స్ త్రాగే గ్లాసులు కూడా కోల్పోవడం జరిగింది. సేమ్ టు పరీక్షలు జరుగుతున్న క్రమంలో పీయూసీ 1 చదువుతున్న దీపిక అనే అమ్మాయి కాపీ కొడుతుందన్న దీపంతో అడ్మినిస్ట్రేషన్ ఆమెను మందలించే క్రమంలో దీపిక అనే అమ్మాయి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో వాష్ రూమ్ లో తన చున్నితో ఉరి వేసుకొని 2 రోజుల క్రితమే ఒక అమ్మాయి బలన్మరణం జరిగింది. ఆ విషయాన్ని మరొక ముందే మళ్ళీ నిన్న రాత్రి ఇంకో అమ్మాయి బూర లికిత తను నివసిస్తున్న హాస్టల్ నాలుగో ఫ్లోర్ పై అంతస్తు నుండి దూకి చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం వీసి,డైరెక్టర్ మొద్దు నిద్ర లేచి చట్టాలు అమలు చేయాలని, ఆర్టీఐ చట్టం ద్వారా రికార్డ్ తనిఖీలకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఒకేసారి అన్ని జిల్లాలలోని కలెక్టర్ల ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వాలని పేరెంట్స్ కమిటీ తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా ఆర్టీఐ చట్టం కార్యదర్శి ప్రసాద్ యెలిశెట్టి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *