ఎమ్మెల్యే ఈటెలకు మరో రాజకీయ ఎదురు దెబ్బ

  • 15 ఏండ్లుగా చికెన్ షాప్ కు లేని రూల్స్ ఇప్పుడెందుకు వచ్చాయి..
  • ఆమె బీఆర్ఎస్ పార్టీ అనే రంగు పూసి,డబ్బా తీసేసిండ్రు
    భాజాపా సర్పంచ్..ఇది నిజం..
  • ప్రాణపాయస్థితిలో ఉన్న నీరుపేద మహిళ ప్రాణాలకు విలువలేదు గానీ..
  • బాజాపా కార్యకర్తలను పరమర్శించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..?
  • దళిత బహుజనుల మీద ప్రేమ లేదనే నిజం బయటపడింది రాజేంద్ర..
  • చివరకు వితంతు మహిళను కూడా విడిచిపెట్టని భాజాప సర్పంచ్..
  • తగిన శాస్తి జరిగిందంటున్న స్థానికులు, ఇందులో పోలీసుల పాత్ర అమోఘం..

హుజురాబాద్, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కం నియోజకవర్గం పరిధిలోని చెల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో 15 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న సుల్తానా అనబడే నిరుపేద వితంతు మహిళ, తన పొట్టకూటి కోసం ఒక చికెన్ సెంటర్ కొట్టు పెట్టుకొని సుమారుగా 15 సంత్సరాలుగా ఆ చికెన్ షాప్ మీద జీవనం కొనసాగించుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

సడెన్ గా ఆ గ్రామ భాజపా సర్పంచ్ మనసు ఈ చికెన్ డబ్బా తీసివేయాలనే ఏకైక కోరికతో వేధించసాగాడు. 15 సంవత్సరాలుగా లేనిది ఒకేసారి ఆ గ్రామ సర్పంచ్ కి ఏమైందో కానీ తనని చికెన్ సెంటర్ డబ్బా తీసివేయాలని వేధించడం ప్రారంభించాడు. ఒక వితంతు మహిళను ఇంతగా ఇబ్బంది పెట్టేసరికి.. చివరికి అసహనానికి గురైన సుల్తానా చావడానికి పురుగుల మందు తాగి చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది. 15 సంవత్సరాలుగా లేని రూల్స్ సడన్గా ఈ భాజపా సర్పంచి ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆనే రంగు పులిసి ఆ డబ్బాను తీసివేయడానికి కొనుకున్నాడు. ఎన్నోసార్లు గ్రామపంచాయతీకి వెళ్లి వేడుకున్న వినని సర్పంచి వీడియో వైరల్ గా మారింది.

చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సుల్తానా స్టేట్మెంట్ తీసుకున్న హుజురాబాద్ పోలీసులు అన్ని ఆధారాలతో కేసు పెట్టి సర్పంచిని జైల్లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈ విషయంలో పోలీసుల పాత్ర ఆమోగమని స్థానికులు అంటున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చి బాధితురాలిని పరామర్శిస్తారు అనుకుంటే పోలీస్ స్టేషన్ కు పోయి వాళ్ళ కార్యకర్తలను పరామర్శించిండం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. భాజపా ఎమ్మెల్యే ఈటెల మాత్రం తన కార్యకర్తలకే పెద్దపీట వేసిండు అని అంటున్నారు స్థానికులు.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు విలువ లేదు గానీ తన భాజపా కార్యకర్తలే తనకు ముఖ్యమన్న విషయం బయటపడింది.

సంపుకుంటారో సాదుకుంటారో అని నువ్వు ఏడుస్తే.. మా నియోజకవర్గ ప్రజలు మంచోళ్ళు కాబట్టి నిన్ను సంపుకోము.. సాదుకుంటామని చెప్పి నీకు రూ. 2.50 లక్షల జీతం ఇచ్చి ఎమ్మెల్యే చేసి సాదుకుంటున్న గడ్డ ఈ హుజురాబాద్ గడ్డ రాజేంద్ర..అలాంటి ప్రజలను నువ్వు ఈరోజు సచ్చిపోతుంటే పట్టించుకోకపోతివి ఈటల ఇదేనా నేనీచ రాజకీయం వ్యవస్థ.

కాబట్టి నువ్వు వచ్చింది నీ కార్యకర్తలను కలిసి ధర్నా చేయడానికి మాత్రమే కానీ ప్రజల కోసం కాదు అనేది అర్ధమైంది రాజేంద్ర..

నీ కార్యకర్త తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది కాని విధులు సమర్ధవంతంగా నిర్వర్తించిన సిఐని పట్టుకొని సంవత్సరం లోపు నీ సంగతి చూస్తా అని బెదిరించిడం పట్ల నీ గుండా రాజకీయం బయటపడింది రాజేంద్ర..

ఏనాడైనా ప్రజాసమస్యలపై అధికారులను నిలదీసినవా రాజేంద్ర.. ఈరోజు తప్పు చేసి జైల్లో ఉన్న నీ కార్యకర్త కోసం హుజురాబాద్ సిఐని దూషించడం సమంజసమా రాజేంద్ర..

అదే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మురికి కాలువ కోసం పలు మార్లు చెప్పినా.. పట్టించుకోని గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే బెదిరించడం అంటున్నావు.. ఒక నిరుపేద వితంతు మహిళ చికెన్ షాప్ పెట్టుకుంటే తీసేస్తే మాత్రం చర్యలు తీసుకొవద్దంటున్నావ్.. ఇది ఎక్కడి న్యాయం రాజేంద్ర..

అధికారులు పని చేయకపోతే దండించేది ప్రభుత్వం.. అదే అధికారులు బాగా పని చేస్తే అవార్డులు, రివార్డులు ఇచ్చేది ప్రభుత్వమే అనే మాట మర్చిపోకు రాజేంద్ర..

మీరు నియోజకవర్గ బహుజన ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీ పని ఐపోయినట్లే కనిపిస్తుంది రాజేంద్ర. మీరు ఈరోజు మైనారిటీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చుస్తే వారు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు రాజేంద్ర.. త్వరలో నీకు ప్రజలే గుణపాఠం చెబుతారు. యావత్తు మైనారిటీ ప్రజలు నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తదని గుర్తు పెట్టుకో రాజేంద్ర..

వేల కోట్లు నీ దగ్గర ఉండొచ్చు కానీ ఈ నిరుపేద మహిళ ఉసురు మాత్రం ఊరికే పోదు.. న్యాయం మాత్రం డబ్బులకు లొంగదు అనే మాట గుర్తు పెట్టుకో రాజేంద్ర.. అని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు ఎంఏ ఫిరోజ్ అదేవిధంగా హుజురాబాద్ మైనారిటీ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు హెచ్చరికలు జారీ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు ఎంఏ ఫిరోజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *