కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
గోవిందరావుపేట, జనవరి 2 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర సర్పంచుల నిధుల మల్లింపుపై నిరసనగా ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులని అక్రమ అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ అన్నారు సోమవారం రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సర్పంచుల విధి, విధానాలు మరియు నిధుల మల్లింపుపై హైదరాబాద్ నందు ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వగా, అట్టి కార్యక్రమానికి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల నాయకులను పస్రా ఎస్.ఐ. కరుణాకర్ రావు అక్రమంగా అరెస్టు చేసి బైండోవర్ చేశారు. అనంతరం సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచుల నిధుల మల్లింపుపై మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని, మా హక్కుల్ని కాలరాస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఒక పక్క సర్పంచులకు నిధులు లేక గ్రామాల అభివృద్ధికి అప్పులు చేసి, తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వారి ఆత్మహత్యలకు నిరసనగా ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమాన్ని , అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపాలనుకోవాలంటే, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, బద్దం లింగారెడ్డి, జంపాల చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.