అరెస్టు అప్రజాస్వామికం … మంజాల బిక్షపతి గౌడ్

ములుగు డిసెంబర్, (28 విశ్వం న్యూస్) : ములుగు జిల్లా జేఏసీ అధ్యక్షుడు ముంజల బిక్షపతి గౌడ్ ను అక్రమంగా అరెస్టు చేయడం సబబు కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రపతి ద్రౌపతి మురమ్ రామప్ప విచ్చేయుచున్న సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇవ్వడం కోసం వెలుచుండగా వారిని పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు జేఏసీ అధ్యక్షుడు బిక్షపతి గౌడ్ తెలిపారు. తాము రాష్ట్రపతిని కలవడం కోసం పాసులు సైతం తీసుకున్నామని ఆయన అన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా వినతిపత్రం ఇస్తే అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ములుగు జిల్లా సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని నలుగు అభివృద్ధి కోసం అదేవిధంగా పోరాడుతామని ఆయన తెలిపారు.