తెలంగాణ వచ్చాకే ప్రతి రైతుల
కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది

- నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది
ఉత్సవాలలో ఎమ్మెల్సీ,
ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట, జూన్ 7 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి పెరుగుదల కారణంగా ప్రతి రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

బుధవారం జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో, అధికారులతో సాగునీటి దినోత్సవాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో చెక్ డ్యాంల నిర్మాణం జరిగిందన్నారు. దీంతో రైతులు తమ పంటలను పండించుకుంటున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, పూడిక తీతతో భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో 5.710 లక్షల ఎకరాలకు అందిన సాగు నారు, నేడు 17.23 లక్షల ఎకరాలకు చేరిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేడు 1.81 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గ ఎం.పి.పి లు, హుజురాబాద్ ఏ.సి.పి, జమ్మికుంట సి.ఐ రమేష్, కె.డి.సి.సి వైస్ ప్రెసిడెంట్ పింగీలి రమేష్, సర్పంచ్ లు, నీటి పారుదల శాఖ అధికారులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.