కరీంనగర్ పోలీస్ నూతన కమిషనర్ గా ఎల్ సుబ్బరాయుడు బాధ్యతల స్వీకరణ

తిమ్మాపూర్, జనవరి 25 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పోలీస్ నూతన కమిషనర్ గా గురువారం నాడు ఎల్ సుబ్బరాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమీషనర్ గా కొనసాగి రాచకొండ కమీషనరేట్ జాయింట్ కమీషనర్ బదిలీపై వెళుతున్న వి సత్యనారాయణ నుండి బాధ్యతలు స్వీకరించారు. నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎల్ సుబ్బరాయుడు 2007లో గ్రూప్ -1 ద్వారా డిఎస్ఏగా పోలీస్ శాఖలో చేరారు. అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురం, ఏలూరులలో డిఎస్పీగా పనిచేశారు. తర్వాత నిజామాబాద్, అనంతరం కరీంనగర్ లో 2012 నుండి 2017 వరకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్ డి) గా పనిచేశారు. గత రెండు సంవత్సరాలు గా సిఐడి విభాగంలో ఎస్పీగా పనిచేశారు.
నూతన కమీషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్, అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, జె. విజయసారధి, విజయకుమార్, సి ప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, బి సంతోష్ కుమార్ లతోపాటుగా పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.