ఎమ్మెల్యే ఇంటిపై దాడి హేయమైన చర్య: బయ్యం వెంకన్న

నాగారం, మార్చి 16 (విశ్వం న్యూస్): తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నివాసంపై కోడి గుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని మండల కాంగ్రెస్ నాయకుడు బయ్యం వెంకన్న అన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంపై బీజేవైఎం నాయకులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
దళిత ఎమ్మెల్యే కావడం వల్లే ఈ విధమైన దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను అనవసరంగా రాజకీయంగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే ఎవరినీ అవమానించేలా మాట్లాడలేదని, కొంతమంది దాన్ని వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారని అన్నారు.
బీజేవైఎం నాయకులు వెంటనే ఎమ్మెల్యేకి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.