విద్యానగర్ ఫేజ్–1లో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ

డిసెంబర్ 1 (విశ్వం న్యూస్) : బైరాగిగూడలోని విద్యానగర్ ఫేజ్–1 కాలనీలో అయ్యప్ప మహాపడి పూజను విజేందర్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్‌కుమార్, నాయకులు నవీన్, శ్రీనివాస్, అంకం శ్రీనివాస్, కొరివి గణేష్, గురు స్వామి బాబు, గురు స్వామి అశోక్, గురు స్వామి వినేష్, గురు శివ, విక్కీ స్వామి తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయ్యప్ప భక్తులతో కళకళలాడిన ఈ మహాపడి పూజ భక్తిశ్రద్ధల నడుమ విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.