గిరిజన యూనివర్సిటీ కోసం పార్లమెంటులో గలమెత్తిన బి.ఎస్.పి
ములుగు, డిసెంబర్ 29, (విశ్వం న్యూస్) : ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని బహుజన సమాజ్ వాజ్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ పార్లమెంటు సమావేశాల్లో తన గళం వినిపించారని బహుజన సమాజ్ వాచ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శనిగరపు నరేష్ కుమార్ జిల్లా అధ్యక్షుడు బొట్ల కార్తీక్ అన్నారు. గురువారం మురుగు జిల్లా కేంద్రంలో సమాజ్వాజ్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేసినట్టు వారి తెలిపారు బి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం గిరిజన యూనివర్సిటీ కోసం పోరాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు పసులాది ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.