కుటుంబ సభ్యులతో మోడీని కలిసిన బండి సంజయ్

ఇట్స్ ఫ్యామిలీ టైం..

న్యూ ఢిల్లీ, ఆగస్టు 3 (విశ్వం న్యూస్) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు. కాగా ఆగస్టు 4 తేదీన శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో బండి సంజయ్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. అందర్ని కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *