బీసీ కులాల్లో నిరుద్యోగ యువతీ
యువకులకు రూ. లక్ష ఇవ్వాలి

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి సంజీవ
గోవిందరావుపేట, జూలై 6 (విశ్వం న్యూస్) : బీసీ కులాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వమిస్తున్న లక్ష రూపాయలు వర్తింప చేయాలని డివైఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు బోచ్చు సంజీవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గోవిందరావుపేట తహసిల్దార్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సంజీవ మాట్లాడుతూ బీసీల్లో 15 కులాల్లో ఉంటున్న యువత ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం తో బాధపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసి నిరుద్యోగులపై సవితి తల్లి ప్రేమ సూచిస్తున్నాయని ఆయన అన్నారు. యువతకు సరియైన ఉపాధి లేక చాలీచాలని వేతనాలతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకి ప్రభుత్వం వెంటనే లక్ష రూపాయలు ఇచ్చి వారి స్వయం ఉపాధికి సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకులు పిట్టల అరుణ్ మాదాసు శ్రావణ్ సిరిపల్లి జీవన్ గణేష్ అరవింద్ కణాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.