అమరారాజా ఫ్యాక్టరీకి భూమి పూజ
మహబూబ్ నగర్, మే 6 (విశ్వం న్యూస్) : అమర రాజా గిగా కారిడార్‌కు మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమర రాజా అధినేత గల్లా జయదేవ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
• దివిటిపల్లికి ఆడబిడ్డగా వచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి గల్లా అరుణ గారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం..
• తెలంగాణ ఎందుకు అని నన్ను అడిగిన అరుణక్కకు., ఉమ్మడి శాసన సభలో మీము చెప్పిందే నేడు నిజమైంది…
• తెలంగాణ కు భారీ పరిశ్రమను తెచ్చిన అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు నమస్కారాలు..
• పాలమూరు జిల్లా స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు..
• పోటీ పరిశ్రమలో వొక పరిశ్రమ రాష్ట్రానికి రావాలంటే ఇతర దేశాలతో పోటీ పడాల్సివుంటుంది. వారిని ఒప్పించి మెప్పించి తేవాల్సివుంటుంది.
• మాదగ్గరికి రమ్మంటే మాదగ్గరికి రమ్మని రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు..
• మనకున్న అతిపెద్ద అస్సెట్ యువశక్తి..142 కోట్లల్లో 70 కోట్లమంది 27 ఏండ్ల లోపున్నారు. భారతదేశానికున్న అడ్వాంటేజ్ మరే దేశంలోనూ లేదు.
• ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రయివేట్ రంగంలో భాగస్వామ్యం కుదుర్చుకుని పరిశ్రమల స్థాపన ద్వారానే అభివృద్ధి సాధ్యం..
• వొక్క పరిశ్రమ ద్వారా డైరక్టుగా పరోక్షంగా ఉద్యోగాలు , అనుబంధ ఉపాధి అవకాశాలు లభిస్తాయి
• అమర్ రాజా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగాలు
• త్రిపుల్ ఎఫెక్ట్ ద్వారా చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయి.
• పదేండ్లల్లో 9,500 కోట్ల పెట్టుబడి దశలవారీగా పెడుతుంది
• వారి 37 ఏండ్లలొ పెట్టిన దానికి రెట్టింపు పెట్టుబడిని ఇక్కడ పెడుతున్నారు.
• మీము ఎంతో కష్టపడి తెస్తున్నం. కానీ ప్రగతి నిరోధకులు ప్రతిచోటా వుంటరు.. నాడు దేవుండ్లకే తప్పలేదు మనం అంతకన్నా గొప్పవాల్లం కాదు..
• ఇక్కడ కాలుష్యం వస్తుందని చిల్లర మాటలు మాట్లాడే వాల్లు అర్థం చేసుకోవాల్సింది వుంది…అదేంటంటే
• లిథియం అయాన్ బ్యాటరీ….లెడ్ ఆక్సైడ్ బ్యాటరీ వొకటి కాదు..
• భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు అవే ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ తయారయ్యే బ్యాటరీలన్నీ లిథియం బ్యాటరీలే.
• జీరో లిక్విడ్ డిశ్చార్చ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తాం
• చిత్తూరు తదితర ప్రాంతాల్లో వొక్క చుక్క కాలుష్యం లేదు..
• ఇంకా అనుమానం వుంటే….10 బస్సులు పెట్టి అక్కడ పంపండి,,,అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంత గొప్పగా మారినాయో చూస్తరు…
• ఇక్కడే ఇల్లు కట్టుకోని వుంటారు జయదేవ్..అని ఆశిస్తున్నా.
• అనవసరంగా చిల్లర మాటలు మాట్లాడేవాల్లు.. మీరు మనసు మార్చుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించండి..
• సిఎస్ ఆర్ అనే ఆలోచన తో అక్కడి ప్రాంతాన్ని చుట్టుపక్కల గ్రామాల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యింది.
• 16 గిగావాట్ హవర్ ప్లాంటు..వొక్క గిగా 5 లక్షల టు వీలర్స్ 35 వేల కార్లకు బ్యాటరీలందుతాయి….10 వేల కొలువులు ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొన్ని వేల మందికి..
• ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుండగానే…ఇక్కడ స్థానికులకు అర్హతకు తగ్గట్టు స్కిల్ డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం..
• వెనకబడేయబడ్డ పాలమూరు జిల్లాకు కుడిపక్కన కరివేన ఎడమన ఉద్దండాపూరు మొత్తం 33 టిఎంసీల కెపాసిటీ అంటే 33 హుస్సేన్ సాగర్ల నీల్లు అందుబాటులోకి వస్తాయి.
• అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్…ఎయిర్ పోర్టు కూడా ఇక్కడనుంచి గంట దూరంలోనే వున్నది.