బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ… 108 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు.. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచి సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు.

హైదరాబాద్, జూన్ 2 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ ప్రధాన పోటీదారులుగా బరిలో నిలిచారు. మొత్తంగా 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే ఇటీవల జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇలా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది అని చెప్పాలి.

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై స్పందించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
🔹విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు
🔹పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు
🔹ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా
🔹ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచింది
🔹ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నాం
🔹భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తాం
🔹రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయం
🔹సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు
🔹అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇది
🔹ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిది
🔹నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. ఈ గడ్డకు శ్రీరామరక్ష బీఆర్ఎస్సే అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *