బిగ్ బ్రేకింగ్.. రూ.30 కోట్లతో MLC ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు

బిగ్ బ్రేకింగ్.. రూ.30 కోట్లతో
MLC ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు

  • డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన బీఆర్ఎస్
  • రఘునందన్ సంచలన ఆరోపణ

హైదరాబాద్, మే 26 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రఘునందన్ రావు వేర్వేరుగా లేఖలు రాశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కెనరా బ్యాంక్‌లోని బీఆర్ఎస్ అధికారిక అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్‌ఛార్జులకు నగదు ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు రఘునందన్‌ ఆరోపించారు.

ఈ మేరకు బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతచేశారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే కోట్లాది రూపాయలను పట్టభద్రుల ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఖాతాలోని డబ్బును వెంటనే ఫ్రీజ్‌ చేసి విచారణ జరపాలని రఘునందన్ డిమాండ్‌ చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *