Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!

హైదరాబాద్, జూన్ 8 (విశ్వం న్యూస్) : ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు(87) కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా రామోజీరావు గత కొంతకాలంగా బెడ్ కె పరిమితమయ్యారు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు.

ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా చెబుతున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండడంతో వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

ఈరోజు తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *