బిల్లుల వివాదం.. కాంట్రాక్టర్‌పై అధికారి దాడి

మార్చి 27 (విశ్వం న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బిల్లులు చెల్లించాలని కోరిన కాంట్రాక్టర్‌పై ఒక అధికారి దాడి చేయడం కలకలం రేపింది.
వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ వీరేందర్ తన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని APAO ఫణి భూషణ కశ్యప్‌ను పలుమార్లు సంప్రదించాడు. ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహించిన కశ్యప్ టేబుల్‌పై ఉన్న వస్తువులతో వీరేందర్‌పై దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో వీరేందర్ ముఖంపై గాయాలు అయ్యాయి. వెంటనే అతడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయడంలో ఆలస్యం జరుగుతోందని, ఇందుకు సంబంధించి గతంలోనే వీరేందర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అదే విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రస్తుత బిల్లులను నిలిపివేస్తూ కశ్యప్ వేధింపులకు పాల్పడ్డాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.