సీజన్–1 క్రికెట్ టోర్నమెంట్‌లో బిఎంఆర్ జట్టు విజయం

సీజన్–1 క్రికెట్ టోర్నమెంట్‌లో
బిఎంఆర్ జట్టు విజయం

హైదరాబాద్, డిసెంబర్ 26 (విశ్వం న్యూస్) : తలారి ప్రేమ్ కుమార్ ప్రీమియర్ లీగ్ సీజన్–1లో భాగంగా నిర్వహించిన తొలి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో బిఎంఆర్ క్రికెట్ గ్రౌండ్ టీం విజేతగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి హాజరయ్యారు. అలాగే నార్సింగ్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, బ్లాక్ అధ్యక్షులు డప్పు నవీన్ కుమార్, భోగాల శ్రీనివాస్, కొరివి గణేష్, రాజారాం అంకం శ్రీనివాస్, క్రాంతి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, శ్రీకాంత్, నజీర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన జట్లను అతిథులు అభినందిస్తూ, విజేతలకు కప్స్ అందజేశారు. ఈ తరహా క్రీడా కార్యక్రమాలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *