సర్పంచ్‌ రేసులో భార్యలిద్దరూ… భర్త గందరగోళంలో!

సర్పంచ్‌ రేసులో
ఇద్దరు భార్యలు…
భర్త గందరగోళంలో!

  • జంగపల్లిలో విచిత్రం… ఇద్దరు భార్యలతో నామినేషన్లు!
  • ఎవరిని సర్పంచ్‌ చెయ్యాలా? భర్తకు ‘డబుల్‌ కన్ఫ్యూజన్’

సిద్దిపేట, డిసెంబర్ 6 (విశ్వం న్యూస్) : సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి గ్రామ సర్పంచ్‌ పదవికి నామినేషన్లు హాస్యాస్పదంగా మారాయి. ఈసారి సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళా రిజర్వేషన్‌ కాగా, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేసిన ‘డబుల్‌ మూవ్‌’ గ్రామంలో చర్చనీయాంశమైంది.

ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండడంతో, మొదటగా నవంబర్‌ 30న పెద్ద భార్యతో నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాల్లో ఎక్కడైనా టెక్నికల్‌ తప్పులు ఉంటే, స్క్రూటినీలో తిరస్కరించే ప్రమాదం ఉందన్న సందేహంతో భర్త మరో నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రెండో భార్యతో కూడా మరో నామినేషన్‌ దాఖలు చేశారు.

నామినేషన్ల దాఖలు గడువు పూర్తయ్యే సరికి పోటీలో ఉన్నవారు ఈ ఇద్దరు భార్యలే కావడం ఆసక్తికర అంశం. ఇప్పుడు వీరిలో ఒకరు నామినేషన్‌ ఉపసంహరించుకుంటే, సర్పంచ్‌ పదవి ఏకగ్రీవంగా మారనుంది. ఈ ‘ఫ్యామిలీ పొలిటికల్‌ డ్రామా’ పై గ్రామంలో జోకులు, చర్చలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *