ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి

అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు జమ్మికుంట వాసులు
జమ్మికుంట, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారత దేశం లోనే ఎక్కడ లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేడు వారి జయంతి పురస్కరించుకొని ఆవిష్కరిస్తూన్న తరుణంలో ఈ కార్యక్రమానికి జమ్మికుంట పట్టణం నుండి వెళ్తున్నటువంటి వారికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కమిషనర్ బి శ్రీనివాస్, వైస్ చైర్మన్ దేశీనీ స్వప్న కోటి, కౌన్సిలర్స్ మారేపల్లి బిక్షపతి, పాతకల రమేష్, శ్రీపతి నరేష్, పొనగంటి రాము, గుల్లి పులమ్మ మొగిలి, కుతాడి రాజయ్య, MRO రాజేశ్వరి, ఎంపిడిఓ, మేనేజర్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.