బీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఈటల

బీఆర్‌ఎస్ సర్కార్‌పై
నిప్పులు చెరిగిన ఈటల

జమ్మికుంట, జూలై 29 (విశ్వం న్యూస్) : కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, మండలాల్లో శనివారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు.

వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువని విమర్శించారు.

బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని.. పరిహారానికి మాత్రం దిక్కు లేదన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు ఆందజేయాలని డిమాండ్ చేశారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలన్నారు.

చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయన్నారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని.. కానీ చేతల్లో మాత్రం ఏమీ చెయ్యరని ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *