కేటీఆర్‌పై కేసు నమోదు

హైదరాబాద్, డిసెంబర్ 19 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయింది. ఫార్ములా-ఈ కార్ రేసులో జరిగిన అవకతవలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. నాలుగు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ , ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసింది.

ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్నది. మరోవైపు.. ఫార్ములా-ఈ కార్ రేసు అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలే లేఖ రాసిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి లేఖను కూడా పంపించారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ఏకపక్షంగా నిధుల బదిలీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో విచారణ చేసి.. ఆ వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదుచేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఫార్ములా ఈ-కారు రేసులో ఏదో కుంభకోణం జరిగిందని అంటున్నారు కదా!
దమ్ముంటే.. చర్చ పెట్టండి, సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *