భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

బిజిగిర్ షరీఫ్ అధ్యక్షుడు ఎగ్బాల్ భాయ్ ఆధ్వర్యంలో…
జమ్మికుంట, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : అత్మ పరిశుద్ధి, పాప ప్రక్షాళనం, దాన ధర్మాచరణము, విశ్వమానవతా ప్రబోధము. స్నేహ సౌభాతృత్వం, శాంతి సామరస్యాలకు ప్రతీకగా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలో ముస్లింలు శనివారం రోజున ఆనందోత్సాహాల మధ్య భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను స్థానిక ఈద్గా లో జరుపుకున్నారు. దివ్య ఖురాన్ అవతరించిన రంజాన్ నెలసరి రోజాలను కఠిన నియమాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించిన ముస్లింలు శుక్రవారం నాటి రాత్రి షవ్వాల్ నెల చంద్ర దర్శనంతో రోజాలను (ఉపవాసాలను) విరమించి రంజాన్ పండుగను సాంప్రదాయ బద్దంగా జరుపుకున్నారు.

పండుగ రోజున తయారు చేసిన తిపి వంటకమైనా షీర్ ఖుర్మాను స్వీకరించిన అనంతరం నూతన వస్త్రాలు ధరించి ఈదుల్ ఫితర్ పండుగ ప్రత్యేక నమాజు ప్రార్ధనలను ఈద్గా లో నిర్వహించారు. ఈద్గాలో మతగురువులు మౌలానా మహ్మద్ నౌమాన్ హాష్మి, మౌజన్ ఖాజా పాషా గారు ప్రత్యేక నమాజ్ మరియు ఖురాన్ లోని సూక్తులను చదివినారు..దాన గుణానికి నిదర్శనంగా పేదలకు ఫిత్ర, వస్త్ర దానంతో పాటు షీర్ ఖుర్మను పంచారు. ఈ సందర్భంగా బిజిగిరి షరీఫ్ గ్రామ సర్పంచ్ శ్రీ రాచపల్లి. సదయ్య గారు; ఎంపీటీసీ శ్రీ రాచపల్లి రాజయ్య; కోరపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ గీరవేన రమా-రాజయ్య; మాజీ సర్పంచ్ యుగంధర్ రెడ్డి గార్లుకు దర్గా కమిటీ వారు శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ;మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అంకుషావలి, సయ్యద్ సమీర్ తో పాటు దర్గా & ఈద్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్; కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రఫ్, కోశాధికారి మొహమ్మద్ మహమూద్; సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ నయీముద్దీన్; సభ్యులు సర్వర్, అహ్మద్, తాజ్, మస్జిద్ అహ్మద్ అధ్యక్షుడు మొహమ్మద్ తస్లిమ్ పాషా, ఫక్రుద్దీన్, మాజీ అధ్యక్షుడు అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *