ఘనంగా పాడి ఉదయానంద్ రెడ్డి జన్మదిన వేడుకలు

వీణవంక, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన గౌరవనీయులు శ్రీ పాడి ఉదయ నందన్ రెడ్డి (యప్ టివీ మరియు టురిటో ఫౌండర్&సీఈవో) గారి జన్మదినం సందర్బంగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో యువనేత బొంగోని ప్రశాంత్ గారు ఘనంగా నిర్వహించారు. అదే విధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి నోట్ బుక్స్ మరియు పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా బొంగోని ప్రశాంత్ గారు మాట్లాడుతూ పాడి ఉదయ నందన్ రెడ్డి గారు ఉచిత కంప్యూటర్ శిక్షణ, విద్యార్థులకు స్కాలర్‌షిప్ లు పంపిణి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుా ఎంతో మంది కుటుంబాలలో వెలుగులు నింపుతున్నటువంటి శ్రీ పాడి ఉదయానందన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అడిగొప్పుల సాయి తేజ, గట్టు సాయికుమార్, చింతల అరవింద్, కుర్మిండ్ల అజయ్, కురిమిండ్ల మహేష్, కొమిరె సిద్ధార్థ, ఉయ్యాల మధు, ఉయ్యాల అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
