21న గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా సదస్సును జయప్రదం చేయండి

21న గ్రామపంచాయతీ కార్మికుల
జిల్లా సదస్సును జయప్రదం చేయండి

వీణవంక, మే 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం మహంకాళి కోంరయ్య అధ్యక్షతన వీణవంక మండల కేంద్రములో నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని, ఏదో మొక్కుబడిగా వెయ్యి రూపాయలు పెంచి చేతులు దులుపుకుందని ఇది సరైంది కాదని, వెంటనే కార్మికులందరికీ 19 వేలు కనీస వేతనం చెల్లించాలన్నారు.

పిఆర్సి వర్తింప చేసే విధంగా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని సవరించి కేటగిర్లవారిగనే పనులు చేయించాలని, 500 జనాభా తో నిమిత్తం లేకుండా పని చేసే ప్రతి కార్మికుడికి కనీస వేతనం చెల్లించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కరోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులందరినీ ఐక్యం చేసి, దశలవారీగా ఆందోళన పోరాటాలు చేసేందుకు ఈ సదస్సు సీఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు, ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యునియన్ జిల్లా కమిటీ సభ్యులు కండేసదయ్య, కాదంకిషన్ రావు
మండల కార్యదర్శి మిట్టపల్లి సదానందం, కమిటీ సభ్యులు దాసరపు శంకర్, మల్లయ్య, లచ్చయ్య, చంద్రయ్య, కొంరయ్య, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *