సెంట్రల్ లైటింగ్
ఏర్పాటు చేయాలి
- న్యూ ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ కబ్రిస్తాన్ ఆవరణములో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలి
- జామే మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రాధిక, కమిషనర్ సమ్మయ్యలకు విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 30 (విశ్వం న్యూస్) : ఈ రోజు జామే మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ రఫీక, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ బాబా తాజుద్దీన్, ఇర్ఫాన్, మహమ్మద్ అహ్మదుల్లా ఖాన్, మొహమ్మద్ అంజద్, మహమ్మద్ మహ్మద్, ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ ఫయాజుద్దీన్, సయ్యద్ జమీల్ అహ్మద్, మహమ్మద్ యాసిన్ ఖాన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రాధిక, మున్సిపల్ కమిషనర్ ఏ సమ్మయ్యలకు కలిసి హుజురాబాద్ జామియా మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు సంబంధించిన సమస్యలను ఏ టు జెడ్ మెడికల్ షాప్ ముందు గల డ్రైనేజ్ పూర్తిగా చెడిపోయింది.
దాన్ని పూర్తిస్థాయిలో కొత్తగా వెంటనే నిర్మాణం చేపట్టాలని, మిషన్ భగీరథ నల్ల కలెక్షన్ ఈద్గా ఆవరణములో వెంటనే ఏర్పాటు చేయాలని, న్యూ ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలి. కబ్రిస్తాన్ అవరణములో సెంట్రల్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలని, ఈద్గా అవరణంలో ఉన్న ముస్లిం కబ్రిస్తాన్ లో మరణించిన ముస్లిం సమాధులపై పెరిగిన గడ్డిని పిచ్చి మొక్కలను మునిసిపల్ కార్మికులచే వెంటనే తొలగించాలని, పిచ్చి మొక్కలు గడ్డిపై పెరగనట్టు స్ప్రే చేయించాలని ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ బీచింగ్ పౌడర్ వెంటనే చెల్లించాలని ఈ సమస్యలను అన్నిటిని వెంటనే హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధిక, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తోపాటు, మున్సిపల్ కౌన్సిలర్ అందరూ చొరవ తీసుకొని ఈ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని ఒక రిప్రజెంటేషన్ అందజేసారు.
సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినం
తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపుమేరకు సెప్టెంబరు ఒకటో తేదీన పెన్షన్ విద్రోహదినంగా పాటి స్తామని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలియ చేశారు.
2004 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారని, దీనిని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆ రోజున విద్రోహదినం జిల్లాలో ఉన్న అన్ని తాలూకా యూనిట్ కేంద్రాల్లో పాటించాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఒక సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలిపించారు.