రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం
పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, జూన్ 16 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి శుక్రవారం సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఘనంగా రాష్ట్రపతికి శాలువా కప్పి పూల బొకే అందించి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్.

మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సి హెచ్ మల్లారెడ్డి, ఎంపీ లు జోగినపల్లి సంతోష్ కుమార్, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, నవీన్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి మంత్రులు , ప్రజాప్రతినిధులను, అధికారులను పరిచయం చేశారు.