జవాన్ అనిల్ గారి పాడే మోసిన
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- జవాన్ పబ్బాల అనిల్ మృతి తీరనిలోటు
కరీంనగర్ బ్యూరో, మే 6 (విశ్వం న్యూస్) : జమ్మూ కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించే హెలికాఫ్టర్ సాంకేతిక సమస్య ఏర్పడటంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ గారు మరణించగా పార్థివదేహం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాకు చేరుకోగా అంతిమయాత్ర లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
మధురానగర్ నుండి మల్లాపూర్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అంతిమయాత్ర లో పాల్గొని పాడే మోసిన దహన సంస్కారాలు అయ్యేంతవరకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనిల్ మృతి బాధాకరం అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తు ప్రమాదంలో చనిపోవడం పట్ల,వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ అంతిమ కార్యక్రమంలో స్థానిక మండల, నియోజక వర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గన్నారు.