కాజీపేటలో దారుణం..

- మైనర్ బాలికపై సీఐ అత్యాచారయత్నం
వరంగల్, అక్టోబర్ 23 (విశ్వం న్యూస్) : వరంగల్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. కాజీపేట సీఐ రవికుమార్ ఓ బాలికపై అత్యాచారయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బుధవారం రోజున లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంటికి రాగానే తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో హుటాహుటిన వెళ్లి కాజీపేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడటం ఏంటని స్థానిక రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కంచె చేను మేసినట్లు ఉంది. సమాజంలో పోలీసుల మంచి గౌరవం ఉంది. కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా మైనర్ బాలికపై సీఐ ఈ దారుణాన్ని పాల్పడటం సిగ్గుచేటు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయినవి. రాష్ట్రానికి హోం మంత్రి లేడు.. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే హోం శాఖ ఉంది.