ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్‌ను
ప్రారంభించిన సీఎం కేసీఆర్

సరిగ్గా 1.05 నిమిషాలకు పార్టీ ఆఫీస్ ప్రారంభం
ఢిల్లీ, మే 4 (విశ్వం న్యూస్) : ఢిల్లీలోని నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం మొదటి పార్టీ ఆఫీస్ అంతస్థులోని తన చాంబర్‌కు కేసీఆర్ చేరుకున్నారు. ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చున్న కేసీఆర్.. రిజిస్ట్రేషన్‌లో సంతకం చేశారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భవన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కేసీఆర్. కేసీఆర్ దుర్గామాత అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు.