
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొంటుంది.
ఏప్రిల్ 16 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో సీఎం బృందం టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా నగరాలను సందర్శించనున్నారు. ఓసాకాలో నిర్వహించనున్న వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణకు చెందిన ప్రత్యేక పెవిలియన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా చర్చలు జరిపేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. పారిశ్రామిక సాంకేతిక సహకారంపై కూడా ముఖ్యంగా చర్చలు జరిగే అవకాశం ఉంది.