చిన్ననాటి స్నేహితులతో సీఎం

వనపర్తి, మార్చి 2 (విశ్వం న్యూస్) : వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వనపర్తి చేరుకున్న సీఎం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక జడ్పీ పాఠశాలలో చిన్ననాటి స్నేహితులను కలిశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.




వనపర్తిలో స్వయం ఉపాధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన రుణమేళా, ఉద్యోగ మేళాలో పాల్గొన్నారు. అలాగే కాశీంనగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.





వనపర్తిలోనే విద్యాభ్యాసం చేసిన సీఎం రేవంత్, విద్యాభ్యాసం సమయంలో పార్వతమ్మ ఇంట్లో ఇద్దెకు ఉన్నారు. అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు.