బోడుప్పల్ లో కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నట్లా లేనట్లా..?

బోడుప్పల్ లో కమిషనర్
టౌన్ ప్లానింగ్ అధికారులు
ఉన్నట్లా లేనట్లా..?

  • మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణి దరఖాస్తులకు కూడా లెక్క లేదా..?
  • పాత కమిషనర్ ఉన్నప్పుడు అక్రమ కట్టడాలకు జంకిన బిల్డర్లు..
  • కొత్త కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో చలరేగిపోతున్నారా..?

బోడుప్పల్, జూన్ 16 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మున్సిపల్ ఆక్ట్ కు తూట్లు పొడుస్తున్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు. గతంలో పాత కమిషనర్ ఉన్నప్పుడు అక్రమ కట్టడాలు కట్టాలంటే జంకిన జనాలు.. ఈరోజు అక్రమ కట్టడాలు కట్టడానికి ముందుకొస్తున్నారంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంతగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు అది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమం. సంవత్సర కాలం నుండి ప్రజావాణిలో అక్రమ కట్టడాలపై పెట్టిన దరఖాస్తులకు కూడా కనీసం విలువ లేకుండా పోతుంటే.. అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా సెల్లర్స్, కమర్షియల్ శట్టర్స్, బహుళ అంతస్థుల నిర్మాణాలు ఎలాంటి పర్మిషన్ లు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్న అధికారులు.

బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయంకు అతి సమీపంలో ఉన్నటువంటి సరస్వతి నగర్, ఆంజనేయ నగర్, వెంకట సాయి వివేక్ నగర్, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఐదు అంతస్థుల అక్రమ భవనం ఏర్పాటుచేసి యథేచ్ఛగా కంప్లీట్ చేసుకుంటున్న వైనం కనబడుతున్న పట్టించుకోని అధికారులు. ప్రతి రోజు వార్త కథనాలు రాస్తున్న ఎలాంటి చర్యలు తీసుకొని కమిషనర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సి డి ఎం ఏ తదితరులు చొరవ తీసుకొని అక్రమ కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *