పోటాపోటీగా నామినేషన్లు

- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల టిసిటిఎన్జీవోస్ ఎన్నికలలో వివిధ పదవుల కొరకు ఉద్యోగులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు
కరీంనగర్, జనవరి 20 (విశ్వం న్యూస్) : కరీంనగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం బ్రాంచ్ కరీంనగర్ ఎన్నికలలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ మరియు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు ఎన్నికలలో శనివారం రోజు కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ కంప్యూటర్ సెక్షన్లో నామినేషన్లు దాఖలు చేశారు.

ఎన్నికల అధికారి వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం విక్టర్ పాల్ ఎన్నికల అధికారిగా నిర్వహించినారు ఈ ఒక్క ఎన్నికలకు సహాయ అధికారులుగా జీ ప్రభాకర్ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో నామినేషన్ దరఖాస్తులు సమర్పించారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ డివిజన్లో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులు ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ పెద్ద పల్లి జగిత్యాల్ సిరిసిల్ల జిల్లాలలో ఉన్న వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులందరూ ఓటు వేసే హక్కు ఉంది ఎన్నికలలో పురుషులతో సమానముగా మహిళా ఉద్యోగులు కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు వరుసలో ఉన్నారు. మహిళ ఉద్యోగులు కూడా నామినేషన్ దరఖాస్తులు వివిధ పదవుల కొరకు దరఖాస్తులు సమర్పించారు.

శనివారం రోజు కరీంనగర్ జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ కార్యాలయము వద్ద ఎటు చూసినా ఉద్యోగులు ఎన్నికలలో పోటీ చేయడానికి నామినేషన్ ఫామ్ తీసుకొని దానికి సంబంధించిన రుసుముకట్టుతూ ఎన్నికలలో పోటీకి సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా ఎన్నికలను తనికీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు కరీంనగర్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా టి సి టి ఎన్జీవోస్ నాయకుడు తిరుపతి వరంగల్ డివిజన్ టి సి టి ఎన్జీవోస్ సంఘ నాయకులు జి ప్రభాకర్ శ్రీనివాస్ తోపాటు కరీంనగర్లో టి సి టి ఎన్జీవోస్ డివిజన్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికలలో కరీంనగర్ డివిజన్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్న జి బిక్షపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

