విధులకు హాజరుకాని డాక్టర్ పై
అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు
హుజురాబాద్ ఆర్సి, జూలై 1 (విశ్వం న్యూస్) :హుజురాబాద్ ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న డెంటల్ డాక్టర్ కనుమల్ల దివ్య సంవత్సరం నుండి డ్యూటీ చేయకుండానే జీతం తీసుకుంటున్నదని సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ కు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కనుమల్ల దివ్య సంవత్సరం నుండి ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండా జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుందని, హాస్పిటల్ లో చుపించుకోనుటకు వచ్చిన రోగులు డాక్టర్ లేరని తెలిసి ఇబ్బంది పడుతూ వెళ్ళిపోతున్నారన్నారు.
డెంటల్ డాక్టర్ కనుమల్ల దివ్య, జిల్లా పరిషత్ చైర్మన్ కూతురు అయినందున డ్యూటీ చేయకుండానే జీతాలు తీసుకోవడం రాజకీయ అండదండలు ఉంటె ఈ విధంగా చేయుట న్యాయమేనా హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్, ఆర్ఎంవో డ్యూటీ చేయకుండానే జీతాలు ఇస్తున్నటువంటి వీరిపై చర్య తీసుకొవాలని తెలిపారు. హాస్పిటల్ లో ఉన్న ఆరు నెలల సిసి ఫుటేజులు తనిఖి చేసి విచారణ జరపి డ్యూటీకి రాకుండా జీతాలు తీసుకునే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లకు సరైన వైద్యం అందే విధంగా ఏర్పాట్లు చేయించాలని సిలివేరు శ్రీకాంత్ అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ని కోరారు.