డిప్యూటీ మేయర్ చాంబర్‌పై కాంగ్రెస్ కార్పొరేటర్ల అభ్యంతరం

డిప్యూటీ మేయర్ చాంబర్‌పై కాంగ్రెస్ కార్పొరేటర్ల అభ్యంతరం

కరీంనగర్, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : కరీంనగర్ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్‌కు ప్రత్యేక చాంబర్ కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వారు విన్నపం సమర్పించారు.

తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 20(3) ప్రకారం డిప్యూటీ మేయర్ పదవి ప్రస్తావన మాత్రమే ఉందని, కానీ ప్రత్యేకంగా చాంబర్ కేటాయింపుపై ఎటువంటి నిబంధనలు లేవని కార్పొరేటర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌కు చాంబర్ కేటాయించడం చట్టవిరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు.

ఇదే అంశంపై గతంలో మున్సిపల్ కమిషనర్‌కు కూడా ప్రతిపాదనలు ఇచ్చామని పేర్కొన్నారు. అయినప్పటికీ తాజాగా డిప్యూటీ మేయర్ స్వయంగా ఒక గదిని కేటాయించుకుని వినియోగించడం అనుచితమని విమర్శించారు.

చట్టంలో లేని అంశంపై కార్పొరేషన్‌పై అదనపు భారం పడేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కాంగ్రెస్ కార్పొరేటర్లు కోరారు.

ఈ విన్నపంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *